ఇప్పటికీ మాసిపోని విభజన గాయాలు.. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి
చెన్నై:15 ఆగస్టు (హి.స.) ప్రతియేటా ఆగస్టు 14న భారతదేశం తన ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటనను బాధతో గుర్తు చేసుకుంటోందని, భారతదేశం రెండు ముక్కలైన సందర్భంగా ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governoe RN Ravi) పేర్కొ
ravi TN GUV


చెన్నై:15 ఆగస్టు (హి.స.) ప్రతియేటా ఆగస్టు 14న భారతదేశం తన ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటనను బాధతో గుర్తు చేసుకుంటోందని, భారతదేశం రెండు ముక్కలైన సందర్భంగా ఏర్పడిన గాయాలు ఇంకా మానలేదని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governoe RN Ravi) పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఎక్స్‌ పేజీలో ఆయన ఓ సందేశం వెలువరించారు. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ ముస్లింలీగ్‌ హింసకు పాల్పడిందన్నారు.

ముస్లింలీగ్‌ చేత ‘కాఫీర్లు’ గా ముద్రవేయబడిన లక్షలాదిమంది తమ పూర్వీకులు వేల సంవత్సరాలుగా నివసించిన భూమి నుండి మరో ప్రాంతానికి వలసపోయారని, ఆ నాటి విభజన గాయాలు ఇంకా మానలేదన్నారు. ముసుగు కప్పుకుని ఉన్న ఇలాంటి దుష్టశక్తులు ఇప్పటికీ పెరుగుతున్నందున దేశం ఈ రోజు (ఆగస్టు 14)ను లోతైన భావోద్వేగంతో గుర్తుంచుకుంటోందన్నారు. ఆ దుష్టశక్తులు అసత్యాలతో, మోసపూరిత చర్యలతో దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ప్రజల మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande