దిల్లీ 16 ఆగస్టు (హి.స.): విద్యుత్ వాహనాల(ఈవీ) బ్యాటరీలను మనమే తయారు చేసుకునే దిశగా అడుగులు వేయాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే..
బడ్జెట్‌లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ తేవడానికే ఖర్చవుతోంది. లక్షలాది కోట్ల రూపాయలు దీనికే పోతున్నాయి. మనం ఇంధనం కోసం ఇతరులపై ఆధారపడకపోతే దానిపై పెట్టే ఖర్చు మన దేశ ప్రజలకోసం ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంపై దృష్టిసారించాం. అందుకోసం నేషనల్ డీప్‌వాటర్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ ప్రారంభించబోతున్నాం. అత్యంత కీలకమైన ఖనిజాల్లోనూ ఆత్మనిర్భరత సాధించే దిశలో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ ప్రారంభించాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ