కర్నూలు, 16 ఆగస్టు (హి.స.)
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. ఒకటి HDL (మంచి కొలెస్ట్రాల్), మరొకటి LDL (చెడు కొలెస్ట్రాల్). ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా LDL స్థాయిలు పెరిగితే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలా మందిలో కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నిపుణుల సలహా ఏంటి..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట నీటిలో నానబెట్టిన రెండు వాల్‌నట్స్ ఉదయం తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని వారు తెలిపారు.
వాల్‌నట్స్ ప్రయోజనాలు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. ఇవి శరీరంలో LDL ఉత్పత్తిని తగ్గించి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడతాయి.
ఫైబర్.. వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను పట్టుకుని.. అది శరీరానికి శోషించబడకుండా బయటకు పంపేస్తుంది.
మంచి కొలెస్ట్రాల్ పెంపు.. వాల్‌నట్స్ మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి. ఈ HDL రక్తనాళాల్లోని అదనపు కొలెస్ట్రాల్‌ను తిరిగి కాలేయానికి చేరవేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి