తిహాడ్‌ జైల్లో 1,500 మంది ఖైదీల శిక్ష తగ్గింపు
దిల్లీ: 16 ఆగస్టు (హి.స.)దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిహాడ్‌ జైల్లోని దాదాపు 1,500 మంది దోషులకు సత్ప్రర్తన కింద శిక్షను తగ్గిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సతీశ్‌ గోల్ఛా వెల్లడించారు. దిల్లీ జైళ్లలో రద్దీని నియంత్రించేందుకు రూ.145.58 కోట్లతో
Adopt zero tolerance policy against crime and criminals – ADG Law


దిల్లీ: 16 ఆగస్టు (హి.స.)దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిహాడ్‌ జైల్లోని దాదాపు 1,500 మంది దోషులకు సత్ప్రర్తన కింద శిక్షను తగ్గిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సతీశ్‌ గోల్ఛా వెల్లడించారు. దిల్లీ జైళ్లలో రద్దీని నియంత్రించేందుకు రూ.145.58 కోట్లతో నరేలాలో కొత్త జైలును నిర్మించనున్నట్లు తెలిపారు. తిహాడ్‌ జైలు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘జైల్లోని 1,497 ఖైదీలను శిక్ష తగ్గింపునకు అర్హులుగా గుర్తించాం. జైల్లో వారి నడవడికను బట్టి ఇప్పుడు 15-25 రోజుల వరకు శిక్ష కాలాన్ని తగ్గిస్తున్నాం. ఖైదీలకు విద్య, నైపుణ్యాలను అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టిన ‘ఉన్నతి’ కార్యక్రమం కింద 600 మంది ఖైదీలకు సత్ప్రర్తనపై శిక్షణ ఇస్తున్నాం. జైలు భద్రత కోసం నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఖైదీలకు జైల్లోనే చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యులను నియమిస్తున్నాం. దిల్లీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.145.58 కోట్లతో నరేలాలో కొత్త జైలును నిర్మిస్తాం’’ అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande