పట్నా/న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో భారీ యాత్రకు సిద్ధమయ్యారు. ఓటరు జాబితా సంక్షిప్త ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని ఆరోపిస్తున్న ఆయన ‘‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో దీనిని చేపట్టనున్నారు. ఆదివారం సాసారాం నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 16 రోజుల పాటు 1,300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్‌తో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మూడు వామపక్ష పార్టీల నేతలూ పాల్గొంటారు. నడవడంతో పాటు వాహనాల్లో ప్రయాణిస్తూ రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ