బిగ్‌బాస్‌-2 విజేత ఎల్విష్‌ యాదవ్‌ ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు
న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)బిగ్‌బాస్‌ ఓటీటీ(హిందీ) సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు భారీగా కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోన
బిగ్‌బాస్‌-2 విజేత ఎల్విష్‌ యాదవ్‌ ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు


న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)బిగ్‌బాస్‌ ఓటీటీ(హిందీ) సీజన్‌-2 విజేత, ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఎల్విష్‌ యాదవ్‌ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు భారీగా కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని అతడి ఇంటి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని దుంగడులు బైక్‌పై వచ్చారు. కాసేపు అక్కడే గడిపి.. ఎల్విష్‌ నివాసంపై 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని రెండు, మూడో అంతస్తులో ఎల్విష్‌ కుటుంబంతో సహా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి. దాడి జరిగిన సమయంలో ఎల్విష్‌ ఇంట్లో లేడని..అతడి కుటుంబసభ్యులు, కేర్‌టేకర్‌ ఉన్నారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అయితే ఘటనకు ముందు అతడికి ఎటువంటి బెదిరింపులు రాలేదని కుటుంబసభ్యులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande