గ్వాలియర్‌ గోపాలుడు రూ.వంద కోట్ల ఆసామి
న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గల గోపాల మందిరం శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులతో కళకళలాడింది. ఈ ఆలయాన్ని వందేళ్ల క్రితం సింధియా రాజవంశం నిర్మించినట్లు ఆలయ పూజారి సాగర్‌ బాబా తెలిపారు. ఏటా జన్మాష్టమి రోజున
గ్వాలియర్‌ గోపాలుడు రూ.వంద కోట్ల ఆసామి


న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో గల గోపాల మందిరం శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భక్తులతో కళకళలాడింది. ఈ ఆలయాన్ని వందేళ్ల క్రితం సింధియా రాజవంశం నిర్మించినట్లు ఆలయ పూజారి సాగర్‌ బాబా తెలిపారు. ఏటా జన్మాష్టమి రోజున భారీ పోలీసు భద్రత మధ్య బ్యాంక్‌ లాకరు నుంచి రూ.100 కోట్ల ఆభరణాలను బయటకుతీసి దేవతా మూర్తులను అలంకరిస్తారు. అంతే మొత్తానికి బీమా చేయించిన ఈ ఆభరణాలు తమ పర్యవేక్షణలో ఉంటాయని గ్వాలియర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సంఘ్‌ ప్రియ చెప్పారు. బంగారు కిరీటాలు, ఏడు వారాల పచ్చల హారాలు, వజ్రాలు.. రత్నాలు పొదిగిన కంకణాలు, పసిడి వేణువు ఇందులో ఉన్నాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande