న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)
హిమాచల్ ప్రదేశ్ మళ్లీ వానలతో అతలాకుతలం (Himachal Pradesh Rains) అవుతోంది. గత రెండు నెలల్లో రాష్ట్రం అంతటా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మండి జిల్లాలోని పానర్సా, టకోలి, నాగ్వైన్ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపేసింది. కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ వరదల్లో మానవ ప్రాణ నష్టం జరగలేదని మండి జిల్లా ఎఎస్‌పీ సచిన్ హిరేమత్ తెలిపారు. కానీ పోలీసులు అప్రమత్తమై పహారా కాస్తూ, రోడ్లు క్లిన్ చేయించి రవాణా తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం జూన్ 20 నుంచి ఆగస్ట్ 16 వరకు వర్షాలతో మృతి చెందిన వారి సంఖ్య 261కి చేరింది. వీరిలో 136 మంది వర్షాలకు సంబంధించి జరిగిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ