న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.)
ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లో మాఫియా ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)పై ప్రశంసలు కురిపించి పార్టీ నుంచి బహిష్కరణ ఎదుర్కున్నారు ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ (Pooja Pal). తాజాగా ఆమె యూపీ సీఎంతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల విజన్ డాక్యుమెంట్ 2047పై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ.. యోగిపై ప్రశంసలు కురిపించారు. తన భర్త (బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజు పాల్) హత్య కేసులో నిందితుడు అతీక్ అహ్మద్ ఆగడాలపై చర్యలు తీసుకోవడంతో తనకు న్యాయం జరిగిందన్నారు. నేరగాళ్లపై యోగి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి వైపే చూస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ