న్యూఢిల్లీ: , 17 ఆగస్టు (హి.స.) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్‌కు తిరిగి రానున్నారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆత్రుతతో ఉన్నానని వెల్లడించారు. యాక్సియం-4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. మిషన్ విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు వస్తున్నట్లు శుక్లా సామాజిక మాధ్యమం తెలిపారు. అమెరికా నుంచి బయలుదేరిన ఆయన విమానంలో కూర్చొన్న ఫొటోను ఈ పోస్టుకు జత చేశారు. ఇక్కడికి వచ్చాక ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ