తిరుమలలో ఈ ఏడాది జూలై.12 న. రికార్డ్ స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి
తిరుపతి:, 22 ఆగస్టు (హి.స.) తిరుమలలో ఈ ఏడాది జులై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజు 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరింది. గ
తిరుమలలో ఈ  ఏడాది జూలై.12 న. రికార్డ్ స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి


తిరుపతి:, 22 ఆగస్టు (హి.స.)

తిరుమలలో ఈ ఏడాది జులై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజు 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరింది. గత ఏడాది జులై నెలలో లడ్డూల ఉత్పత్తి (చిన్నవి 160-180 గ్రాములు) 1,04,57,550 ఉండగా ఈ ఏడాది జులైలో 1,25,10,300కు పెరిగింది. గత జులైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జులైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతోపాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు సరిపడా అవసరాల కోసం బఫర్‌ స్టాక్‌ కింద 4 లక్షలు పెట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande