హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
భారత జట్టు హెడ్ కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ లో అనేక సంవత్సరాలుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన సారథ్యంలో రాజస్థాన్ జట్టులోకి పదుల సంఖ్యలో యువ ప్లేయర్ వచ్చి, భారత జట్టులో సైతం అరంగేట్రం చేశారు. అయితే IPL 2026 ఫ్రాంచైజీతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తన పదవీ కాలాన్ని ముగించనున్నట్టు జట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా RR జట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో రాయల్స్ ప్రయాణంలో చాలా సంవత్సరాలు రాహుల్ కేంద్రంగా ఉన్నారు. అతని నాయకత్వం అనేక మంది ఆటగాళ్లను ప్రభావితం చేసింది. స్క్వాడ్లో బలమైన విలువలను నెలకొల్పింది. ఫ్రాంచైజ్ సంస్కృతిపై ఒక చెరగని ముద్ర వేసింది. ఫ్రాంచైజ్ నిర్మాణ సమీక్షలో భాగంగా రాహుల్కు ఫ్రాంచైజీలో బ్రాడర్ స్థానం లభించింది. ఫ్రాంచైజీకి రాహుల్ చేసిన అద్భుతమైన సేవకు రాజస్థాన్ రాయల్స్, దాని ఆటగాళ్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని ఆర్ ఆర్ యాజమాన్యం రాసుకొచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్