సమయపాలన పాటించని అధికారులకు కలెక్టర్ క్లాస్..
తెలంగాణ, మెదక్. 30 ఆగస్టు (హి.స.) మెదక్ జిల్లా కలెక్టరేట్లో సమయ పాలన లేకుండా విధులకు వస్తున్న అధికారులను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లిన అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్నాళ్లుగా సాగుతున్న
మెదక్ కలెక్టర్


తెలంగాణ, మెదక్. 30 ఆగస్టు (హి.స.)

మెదక్ జిల్లా కలెక్టరేట్లో సమయ పాలన లేకుండా విధులకు వస్తున్న అధికారులను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లిన అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ గుట్టును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేసిన ఆకస్మిక తనిఖీతో రట్టయింది. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలు కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రెవెన్యూ కార్యాలయంతో పాటు ఔట్ వార్డు, ఇన్ వార్డు సెక్షన్, ఖజానా శాఖ కార్యాలయం, ఎన్ఐసీ కార్యాలయాలను తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి 11:30 గంటలు అవుతున్న కొంతమంది సిబ్బంది విధులకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande