ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చే
ఏసీబీఏసీబీ


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసి రూ. 70 వేలు తీసుకుంటుండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్తో పాటు డాక్యుమెంట్ రైటర్ రమేశ్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్. ఇవాళ రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా రాజేశ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande