చిత్తూరు. జిల్లా శ్రీరంగరాజపురం తమండలంలోని పిల్లారికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన తెదేపా కార్యకర్త మునుస్వామి ఇంటి పై దాడి
చిత్తూరు, 22 ఆగస్టు (హి.స.)జిల్లా శ్రీరంగరాజపురం తమండలంలోని పిళ్లారికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన బాలయ్య కుమారుడు తెదేపా కార్యకర్త మునస్వామి ఇంటిపైకి.. అదే గ్రామానికి చెందిన కుప్పయ్య కుమారుడు వైకాపా కార్యకర్త జగన్నాథం గురువారం ట్రాక్టర్‌తో హత్యాయత్నం చ
చిత్తూరు. జిల్లా శ్రీరంగరాజపురం తమండలంలోని పిల్లారికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన తెదేపా కార్యకర్త మునుస్వామి ఇంటి పై దాడి


చిత్తూరు, 22 ఆగస్టు (హి.స.)జిల్లా శ్రీరంగరాజపురం తమండలంలోని పిళ్లారికుప్పం ఎస్సీ కాలనీకి చెందిన బాలయ్య కుమారుడు తెదేపా కార్యకర్త మునస్వామి ఇంటిపైకి.. అదే గ్రామానికి చెందిన కుప్పయ్య కుమారుడు వైకాపా కార్యకర్త జగన్నాథం గురువారం ట్రాక్టర్‌తో హత్యాయత్నం చేశాడు. అతడి ఇంటి ప్రహరీని ఢీకొట్టడమే కాక.. మునస్వామని ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో అతడికి గాయాలయ్యాయి. స్థానికులు మునస్వామిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రహరీ పడిపోయి ట్రాక్టర్‌ ముందు భాగం ఇంట్లోకి కొంతమేర వచ్చేసింది.

ఎన్నికల్లో తన భర్త తెదేపా ఏజెంట్‌గా వ్యవహరించాడనే కారణంతోనే జగన్నాథం దాడి చేసి గాయపరిచాడని, తమకు భయంగా ఉందని బాధితుడి భార్య అనసూయ వాపోయారు. తమను చంద్రబాబు, లోకేశ్‌ కాపాడాలని కోరారు. దీనిపై ఎస్సై సుమన్‌ను వివరణ కోరగా జగన్నాథం, మునస్వామికి భూ తగాదాలు, పాతకక్షలు ఉన్నాయని, ఆ కారణంగానే దాడి జరిగిందని, విచారణ చేపట్టి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande