హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
బీజేపీ పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని రామచంద్రపురం లోని తమ నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వీరితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, హిందూ వ్యతిరేక ప్రభుత్వం గా పేరు తెచ్చుకొంటుదన్నారు. అధికారంలో ఉన్నామని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేయాలని చూడటం దురదృష్టకరం అని నిర్బంధాలతో బీజేపీ కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దం అని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని హిందూ వ్యతిరేక కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్