యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు.. రఘునందన్ రావు
తెలంగాణ, సిద్దిపేట. 22 ఆగస్టు (హి.స.) యూరియా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శుక్రవారం ఎంపీ మాట్లాడారు. రాష్ట
రఘునందన్ రావు


తెలంగాణ, సిద్దిపేట. 22 ఆగస్టు (హి.స.)

యూరియా విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శుక్రవారం ఎంపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మిస్ మేనేజ్మెంట్, కృత్రిమ కొరత సృష్టించడం మూలంగా అన్నదాతలు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయనుందని తెలిపారు. రాజకీయ పార్టీ నేతల తప్పుడు ప్రచారాలకు రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande