టేకులపల్లిలో రూ.2 కోట్లకు పైగా విలువైన గంజాయి పట్టివేత
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 22 ఆగస్టు (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం వెంకట్
గంజాయి


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 22 ఆగస్టు (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం వెంకట్యాతండా సమీపంలో సీసీఎస్, టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వావాన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన లారీ( RJ06GC0833 )ని చెక్ చేయగా అందులో 424.950 కేజీల గంజాయి లభించింది. దీని విలువ రూ.2 కోట్ల 12 లక్షల 47 వేలుగా తెలిపారు. నిందితులు గంజాయిని కొనుగోలు చేసి ఒడిశా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తున్నట్లుగా సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande