అమరావతి, 22 ఆగస్టు (హి.స.)
చీడికాడ: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో బొడ్డేరు వంతెన కూలింది. కట్టవాని అగ్రహారం-విజయరామరాజుపేట మధ్య వంతెన కూలిపోవడంతో చీడికాడ, బుచ్చయ్యపేట మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ డెయిరీ తన సొంత నిధులతో ఈ వంతెన నిర్మించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ