బీజేపీ అంటే అంత భయమెందుకు.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) కాంగ్రెస్ సర్కార్కు బీజేపీ పార్టీ అంటే అంత భయమెందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చేవెళ్ల వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని ఆయన త
బండి సంజయ్


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

కాంగ్రెస్ సర్కార్కు బీజేపీ పార్టీ అంటే

అంత భయమెందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చేవెళ్ల వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే.. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి తమ వైఫల్యాలను కాంగ్రెస్ కప్పిపుచ్చుకోవాలనుకుంటోందని కామెంట్ చేశారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. అరెస్ట్ చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పాటు కార్యకర్తలు, కార్పొరేటర్లందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande