న్యూఢిల్లీ, 22 ఆగస్టు (హి.స.)
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా పై రెండు రోజుల క్రితం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత సీఎం రేఖా గుప్తా తొలిసారి ఓ పబ్లిక్ ఈవెంట్కు హాజరయ్యారు. గాంధీనగర్ లోని అశోక్ బజార్లో హోల్సేల్ రెడీమేడ్ గార్మెంట్స్ డీలర్ల సంఘం నిర్వహించిన పబ్లిక్ ఈవెంట్లో శుక్రవారం సీఎం పాల్గొన్నారు. ఆగస్టు 20న జరిగిన దాడి తర్వాత రేఖా గుప్తా ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్