హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా హైదరాబాద్లో నిర్వహించిన ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. 'విద్య ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ వాళ్లను చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని విమర్శించారు. మెకానికల్ లైఫ్ కాదు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య మానవ సంబంధాలే ఉండాలని తాము చూస్తున్నామన్నారు. ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చని పేర్కొన్నారు. సీఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెప్పపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నాం అని భట్టి చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..