హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల
ఎమ్మెల్యే కేటీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో నేడు వారు మాట్లాడుతూ.. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?, అప్పుడు చిల్లర అనిపించలేదా? అని విమర్శించారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ సభలో చెప్పారు, ఆ మాట నువ్వు మర్చిపోయావా? అంటూ కేటీఆర్పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే.. ఆ పార్టీ నుంచే పాఠాలు నేర్చుకున్న మీ నాన్న కూడా థర్డ్ క్లాసే కదా? అని జగ్గారెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..