కేసీఆర్, హరీష్రరావుకు హైకోర్టులో నిరాశ!
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్ను దాఖలు చే
Kcr


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తిస్థాయి కౌంటర్ను దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్, హరీష్రవు ఎమ్మెల్యేలు కాబట్టి.. అసెంబ్లీలో చర్చించాకే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

ప్రభుత్వంపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. ముందస్తుగా మీడియా సమావేశం నిర్వహించి.. 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అన్ని పబ్లిక్ డొమైన్ నుంచి వెంటనే రిపోర్ట్ తొలగించాలని ఆదేశించింది. కమిషన్ 8B, 8C నోటీసులు ఇవ్వకుండా.. పిటీషనర్లపై ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande