హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాద్ మినిష్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రైల్వే జేఏసీ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు వీలైనంత సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అదే విదంగా స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి తప్పకుండా ఖాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మడికొండ ఇండ్ర స్ట్రీయల్ ప్రాంతాన్ని సందర్శిస్తానని హామీనిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్