తెలంగాణ, హుస్నాబాద్. 22 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా మల్లారం గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్ల గడ్డ తండాలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఈరోజు పనుల జాతర కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు