జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆస్తులు రూ.1.42 లక్షల కోట్లపైనే : గడ్కరీ
న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.)2024-25 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రకాల పద్ధతుల్లో మోనటైజేషన్ చేయడం ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం రూ.1,42,758 కోట్లను సేకరించింది. ఈ సమాచారాన్ని గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి ని
Nitin Gadkari


న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.)2024-25 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రకాల పద్ధతుల్లో మోనటైజేషన్ చేయడం ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం రూ.1,42,758 కోట్లను సేకరించింది. ఈ సమాచారాన్ని గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం హైవే ఆస్తులను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (ToT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT), సెక్యూరిటైజేషన్ (SPV ద్వారా ప్రాజెక్ట్ ఆధారిత ఫైనాన్సింగ్) అనే మూడు పద్ధతుల ద్వారా మానిటైజేషన్ చేస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించినట్లు ఆయన లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande