న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.)దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం.. శత్రుత్వం అంటూ ఏమీ ఉండదని, అలాగే శాశ్వత మిత్రులు కాని, శత్రువులు కాని ఉండరని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) అన్నారు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రక్షణరంగంలో ఆత్మనిర్భరత సాధించడం అత్యావశ్యకమని ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొని మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడి-ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, ట్రంప్ టారిఫ్‌లు, ప్రధాని మోదీ (PM Modi) చైనా పర్యటన నేపథ్యంలో భారత్ అనుసరిస్తోన్న వైఖరిని వెల్లడించారు. ‘‘ప్రపంచం వేగంగా మారుతోంది. అదే సమయంలో కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయి. మహమ్మారులు, ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి వాటితో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో కూడి ఉందని అర్థమవుతోంది. ఈనేపథ్యంలో మన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా.. ఆత్మనిర్భరత అనేది అత్యావశ్యకం. మనకు శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. భారత్ ఎవరినీ శత్రువుగా పరిగణించదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ