న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రెండురోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. అమెరికా సుంకాల మోత వేళ జరుగుతోన్న ఈ పర్యటనపై భారత్, చైనా (India-China) నుంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ రెండు దేశాలు సాంస్కృతికంగా ఎలాంటి సంబంధాలు కలిగిఉన్నాయో తెలియజేసే ఒక చిత్రాన్ని అక్కడి రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది.
‘‘టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమలు ఇవి (Lord Ganesha images). శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇవొక అందమైన ప్రతీకలు’’ అని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూజింగ్ ఆ చిత్రాలను షేర్ చేశారు (Chinese embassy Post) . ఒకవైపు మోదీ (PM Modi) పర్యటన, మరోవైపు దేశమంతా గణేశ్ నవరాత్రులు నిర్వహించుకుంటోంది. ఈ తరుణంలో ఆ పోస్టు వైరల్‌గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ