నీలగిరి జిల్లాలో కుండపోత.. దీవులుగా మారిన పల్లపు ప్రాంతాలు
చెన్నై/న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) నీలగిరి(Neelagiri) జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి.
Flash flood


చెన్నై/న్యూఢిల్లీ,30 ,ఆగస్టు (హి.స.) నీలగిరి(Neelagiri) జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు కురిసిన వర్షానికి గూడలూరు, పందలూరు పరిసర ప్రాంతాల్లో వరద దృశ్యాలు నెలకొన్నాయి. పల్లపు ప్రాంతాలు దీవులుగా మారాయి. గూడలూరులోని ప్రధాన రహదారుల్లో మోకాలిలోతు వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. పాడంతురై - అలవాయల్‌ మెయిన్‌రోడ్డు పూర్తిగా నీట మునిగింది. ఆ మార్గంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. ఈ వర్షాలకు దేవలా ప్రాంతం వద్ద సుందరలింగం అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలింది.ఆ ఇంటి శిథిలాల మధ్య చిక్కుకుని అతడి భార్య చంద్రిక (50) గాయపడ్డారు. చుట్టుపక్కలి వారి ఆమెను వెలికి తీసి ఊటీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదే విధంగా ముత్తులింగం అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూడా కూలింది. ఊటీలోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు అలముకుంది. ప్రభుత్వ అధికారులు వర్షబాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande