తెలంగాణ, నల్గొండ. 22 ఆగస్టు (హి.స.)
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఇస్మాయిల్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఆజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో 20 నెలల కాలంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఊరురా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇండ్లు, జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తునట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు