ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ, 22 ఆగస్టు (హి.స.) బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందిని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ
నల్గొండ ఎస్పీ


నల్గొండ, 22 ఆగస్టు (హి.స.)

బాధితుల ఫిర్యాదుల పట్ల జాప్యం

చేయకుండా, తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని పోలీస్ సిబ్బందిని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేసన్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధి భౌగోళిక పరిసరాలు, కేసుల నమోదు, విచారణ పురోగతి, సిబ్బంది పనితీరు, రౌడీ షీటర్స్ వివరాలను సీఐ రాజశేఖర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అలాగే రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాకప్, ఎన్హెచ్ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన కిట్లను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించవద్దని, సమగ్ర విచారణ చేపట్టి దోషులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande