కస్తూర్భా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల, 22 ఆగస్టు (హి.స.) ముస్తాబాద్ మండల కేంద్రంలో గల కేజీబీవీని శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటకాలను కలెక్టర్ పరిశీలించాడు. అనంతరం అన్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లు ఎలా జరుగుతున్నాయి అని విద్
రాజన్న కలెక్టర్


రాజన్న సిరిసిల్ల, 22 ఆగస్టు (హి.స.)

ముస్తాబాద్ మండల కేంద్రంలో గల కేజీబీవీని శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూం, వంటకాలను కలెక్టర్ పరిశీలించాడు. అనంతరం అన్ అకాడమీ ఆన్లైన్ క్లాస్లు ఎలా జరుగుతున్నాయి అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజుల నుండి పాఠశాలలో అంతర్జాలం సమస్య ఏర్పడిందని అప్పటి నుండి ఆన్లైన్ క్లాసులకు అంతరాయం ఉందని పాఠశాల యాజమాన్యం చెప్పటడంతో కలెక్టర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్య ఉందని పై అధికారులకు తెలియజేయకుండా జాప్యం వహించినందుకు చివాట్లు పెట్టారు పాఠశాలలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు తెలుపాలని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande