తెలంగాణ, ఖమ్మం.22 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామీణ
ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ కలుగుతుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. శుక్రవారం ఏన్కూరు మండల పరిధిలోని గార్ల ఒడ్డు గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంలో రోడ్లను అభివృద్ధి పరిచిన దాఖలు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రావడంతో ప్రజాసంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రామదాసు నాయక్ అన్నారు. పేదల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు