సచివాలయ ముట్టడికి బీజేపీ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత, పలువురు కార్పొరేటర్లు అరెస్ట్
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ''సేవ్ హైదరాబాద్'' పేరుతో.. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని
బిజెపి


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని 'సేవ్ హైదరాబాద్' పేరుతో.. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే మరికొందరు నాయకులు, కార్పొరేటర్లు పోలీసుల కళ్లుగప్పి తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరకున్నారు. కరెంట్ తీగలతో మరణాలు, జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేవారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande