హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. “సేవ్ హైదరాబాద్” పేరుతో బీజేపీ నేతలు సచివాలయం వద్ద నిరసనలు చేపట్టగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నేతలు సచివాలయం వైపు చేరుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
బీజేపీ ప్రధానంగా హైలైట్ చేసిన అంశాలు—హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న కరెంట్ తీగలతో జరిగిన మరణాలు, డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో మరింత ప్రమాదకరంగా మారిన గుంతల రోడ్లు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాలు తగిన సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని నేతలు విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు