న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.) పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అనంతరం, సెక్యూరిటీ సిబ్బంది.. అతడిని పట్టుకున్నారు. దీంతో, ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి కొత్త పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఉదయమే పార్లమెంట్ వద్ద ఉన్న చెట్టు ఎక్కి.. గోడ దూకి లోపలికి ప్రవేశించినట్టు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో అతడిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ