తెలంగాణ, ఆసిఫాబాద్. 22 ఆగస్టు (హి.స.)
సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
బాబు దీక్ష విరమణ చేశారు. జీవో నెం.49కు వ్యతిరేకంగా ఆయన దీక్ష చేపట్టారు. పోడు రైతులకు న్యాయం చేయాలని పాల్వాయి డిమాండ్ చేశారు. కుమురంభీం జిల్లా సిర్పూర్లో తన నివాసంలో నిరవధిక దీక్షకు దిగారు. మూడు రోజులుగా దీక్షను కొనసాగించిన ఆయనతో శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు దీక్ష విరమణ చేయించారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ పోడు రైతుల ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తాము ఉంటామన్నారు. ఇప్పటికైనా పోడు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు