ముంబయి,22 ఆగస్టు (హి.స.)
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్‌నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్‌బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం రాష్ట్రంలో 94 శాతం మంది జీవితంలో తలెత్తే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
జీవిత బీమా అనేది పొదుపు, రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 100 శాతం అవగాహన ఉంది. వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని 38 శాతం మంది భావిస్తున్నారు. సబ్‌సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ 2.0 ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐఏసీ–లైఫ్ కో–చెయిర్‌పర్సన్ వెంకటాచలం ఈ విషయాలు తెలిపారు.
రాష్ట్రంలో టర్మ్, చైల్డ్, పొదుపు ప్లాన్లతో పాటు ఇతర బీమా పథకాల గురించి ప్రాంతీయంగా టీవీ, డిజిటల్ తదితర మాధ్యమాల ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రచార కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నట్లు వివరించారు.
94% మంది తెలంగాణ ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
100% అవగాహన జీవిత బీమా గురించి ఉంది — ఇది పొదుపు మరియు రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ప్ర
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ