చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
కర్నూలు, 22 ఆగస్టు (హి.స.)బ్లాక్‌ కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రజల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. మీరు దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బ్లాక్ కా
The Health Benefits of Black Coffee


కర్నూలు, 22 ఆగస్టు (హి.స.)బ్లాక్‌ కాఫీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ప్రజల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. మీరు దీర్ఘకాలం, ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బ్లాక్ కాఫీ తీసుకోవడం ప్రారంభించవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, చక్కెర లేకుండా బ్లాక్‌ కాఫీ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్లాక్ కాఫీ తాగడం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది. కాలేయ పనితీరు పెరుగుతుంది. బ్లాక్‌ కాఫీలో న్యూరోట్రాన్సిమీటర్‌ ప్రేరేపించే గుణాలు ఉంటాయి. కాఫీ నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుంది. ఇది ఎడ్రినాలైన్‌ విడుదల చేస్తుంది. దీంతో మీరు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటారు.

బ్లాక్ కాఫీలో క్యాలరీ కూడా తక్కువగా ఉంటాయి. ఇది మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారికి బెస్ట్‌ అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది. కాఫీ నాడీ వ్యవస్థను కూడా ప్రేరేపిస్తుంది. దీనివల్ల అడ్రినలిన్ విడుదల అవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande