ముగిసిన సినీ కార్మికుల సమ్మె.. కృష్ణ నగర్ లో షూటింగ్స్ హడావిడి
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.) గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. నిర్మాతలు, , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ నిన్న జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. దాంతో నేటి నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. తెల
టాలీవుడ్ సమ్మె


హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)

గత 18 రోజులు గా జరిగిన సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. నిర్మాతలు, , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ నిన్న జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. దాంతో నేటి నుండి సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునుండే కృష్ణ నగర్ లో కోలాహలంగా మారింది. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ తో షూటింగ్స్ సందడి నెలకొంది. చివరి షెడ్యూల్ లో హాల్టింగ్ అయి ఉన్న సినిమాలు నేటి నుంచే షూటింగ్ షురూ చేసాయి. ఎక్కడ బ్రేక్ లేకుండా షూట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు కొందరు మేకర్స్.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande