తెలంగాణ, వనపర్తి 22 ఆగస్టు (హి.స.)
ఇందిరమ్మ రాజ్యం పేదల పక్షంగా
పనిచేస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం వనపర్తి ఖిల్లా గణపురం మండలం సల్కేలాపురం గ్రామంలో వారు మార్నింగ్ వాక్ చేపట్టారు. గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులతో మాట్లాడారు.
గత పదేళ్ల కాలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం ఎన్నో పర్యాయాలు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగిన ఎలాంటి లాభం లేకుండా పోయిందని, ఇబ్బందులు ఎదుర్కొన్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం,ఇందిరమ్మ రాజ్యంలో మా సొంత ఇంటి కల నెరవేరిందని, రేషన్ కార్డులు అందాయని, సన్న బియ్యం తింటున్నామని ఆనందంతో మహిళలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు