బెంగాల్‌ జైళ్లలో ఏఐ.. కరడుగట్టిన ఖైదీలపై నిఘా
న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.) జైళ్లలో నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి బెంగాల్‌ (Bengal) ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. నేరగాళ్లపై నిఘా కోసం ఏఐ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల బె
బెంగాల్‌ జైళ్లలో ఏఐ.. కరడుగట్టిన ఖైదీలపై నిఘా


న్యూఢిల్లీ: ,22 ఆగస్టు (హి.స.)

జైళ్లలో నేరగాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి బెంగాల్‌ (Bengal) ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. నేరగాళ్లపై నిఘా కోసం ఏఐ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవల బెంగాల్‌లోని పరివర్తన కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్న కరడుగట్టిన నేరగాళ్లు బయట జరిగే నేరాలకు జైళ్ల నుంచి ప్రణాళికలు వేయడం, గంజాయి అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలు వంటి నేరాలకు ప్లాన్‌ చేస్తుండడంతో జైలు కేంద్రాలు నేరాలకు నిలయాలుగా మారాయన్నారు. అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను గుర్తించి, అడ్డుకునేందుకు వీలుగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande