పెరిగిన రద్దీ.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమల, 22 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెర
తిరుమలతిరుమల


తిరుమల, 22 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirupati) కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగిపోయింది.

దీంతో ఈ రోజు శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్ని నిండిపోయి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక గురువారం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని మొత్తం 65,112 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 27,331 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీకి రూ.3.49 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande