వారిని ప్రజలే ఛీ కొడతారు: మంత్రి నారాయణ మాస్ వార్నింగ్
అమరావతి, 22 ఆగస్టు (హి.స.)అమరావతి(Amaravati)ని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారని వైసీపీ(Ycp) నేతలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన
నారాయణ


అమరావతి, 22 ఆగస్టు (హి.స.)అమరావతి(Amaravati)ని ఆపాలని చూస్తే ప్రజలే ఛీ కొడతారని వైసీపీ(Ycp) నేతలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. రాజధానిలో నీరుకొండ వద్ద కొండవీటి వాగు(Kondaveeti Vagu)ను నారాయణ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు వద్ద సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వెస్ట్ బైపాస్ బ్రిడ్జి కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాలని, కానీ పూర్తిగా మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు గండి కొట్టి నీటిని బయటకు పంపించారని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా పని గట్టుకొని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ వాళ్ళు కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేశారని పేర్కొన్నారు. రాజధాని పనులు జరుగుతుండటంతో వరద నీరు వచ్చిందని, ఒక కంపెనీ వాళ్లు తమ ఆఫీస్ కు వెళ్లేందుకు వాగు మీద రోడ్డు వేసేశారని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande