వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో సూచీలు
ముంబయి,22 ఆగస్టు (హి.స.) దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ శుక్రవారం మన సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 407 పాయింట్లు నష్టపోయి 81,593 వద్ద ఉం
TCS


ముంబయి,22 ఆగస్టు (హి.స.)

దేశీయ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్ పడింది (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల నడుమ శుక్రవారం మన సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 407 పాయింట్లు నష్టపోయి 81,593 వద్ద ఉండగా.. నిఫ్టీ 127 పాయింట్లు క్షీణించి 24,957 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.36 వద్ద కదలాడుతోంది.

నిఫ్టీ సూచీలో లార్సెన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆసియన్ పెయింట్స్‌, ట్రెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్‌ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నరావో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పాటు యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రసంగం నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande