రాజమండ్రి, 22 ఆగస్టు (హి.స.)తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి(Rajahmundry) వద్ద గోదావరి నది(Godavari River) ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరింది. అలాగే పుష్కర ఘాట్ మెట్లను వరద ప్రవాహం దాటింది. అటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లు ఎత్తి 13, 05,400 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 14 అడుగులుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి