అమరావతి, 22 ఆగస్టు (హి.స.)జనసేన(Jansena) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాలు(Temples), ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు(Varalakshji Vratham) ప్రారంభమయ్యాయి.
జనసేన(Janasena) పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సూచనల మేరకు శ్రావణ మాసం సందర్భంగా ఈ నెలలోని ఐదు శుక్రవారాల పాటు ఆ పార్టీ నాయకులు వరలక్ష్మీ వ్రతాలను కొనసాగిస్తున్నారు. ఈ రోజు చివరి శుక్రవారం కావడంతో పిఠాపురంలో 1500 మంది మహిళలతో ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం(Uma Kukkuteswara Swamy Temple)లో సామూహిక వరలక్ష్మీ వ్రతం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొన్నారు. ప్రస్తుతం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల అనంతరం భక్తులకు పసుపు, కుంకుమ కిట్లు పంపిణీ చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలకు పవన్ కల్యాణ్ కానుక ఇస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు శ్రీపాదగయ పుణ్యక్షేత్రంలో చేపట్టిన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి