సురవరం మృతి పై సంతాపం ప్రకటించిన బండి సంజయ్, రామచంద్ర రావు
హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.) సురవరం సుధాకర్రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు.
బండి సంజయ్


హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)

సురవరం సుధాకర్రెడ్డి.. నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్రెడ్డి మృతి పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరం అన్నారు. సౌమ్యుడు, మృధుస్వభావి, అందరితో కలిసి మెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని బండి సంజయ్ కొనియాడారు.

ఇక సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందన్నారు. తెలుగు వ్యక్తి సీపీఐ జాతీయ పార్టీ కార్యదర్శి గా పనిచేయడం జరిగిందని.. జాతీయ పార్టీకి నాయకత్వం వహించారని చెప్పారు. తెలుగు వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి గుర్తింపు పొందారని... సౌమ్యుడిగా.. అందరితో కలిసి మెలిసి ఉండేవారని.. గొప్ప మేధావిగా అభివర్ణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande