నల్గొండ, 23 ఆగస్టు (హి.స.)
గత బీఆర్ఎస్ ప్రభుత్వం... కమీషన్ల
కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను వృధా చేశారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీల అలసత్వం వల్లనే నేడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి నుంచి మాండ్ర వరకు 14 కోట్ల రూపాయలతో నిర్మించే రోడ్డుపనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొని ఎంపీ మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరలో నిర్మాణం చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు